18 August, 2026 | 5:00 PM

Breaking News

చెట్లు నరికివేతపై ఫిర్యాదు   •   భిన్న దృక్కోణాల ద్వారా మానసిక సవాళ్లను పరిష్కరించాలి   •   బెస్ట్ ఎంప్లాయి అవార్డు గ్రహీతకు సన్మానం   •   ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ   •   ఎమ్మార్వో పి.విట్టల్, సీఐ వెంకట్ నారాయణకు ఘన సన్మానం   •   భూస్వాముల అన్యాయానికి ఎదురునిలిచిన విప్లవ వీరుడు   •   సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం   •   ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం   •   ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు   •  

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

22-05-2026 01:02 AM

కూసుమంచి, మే 21(విజయక్రాంతి): భారత మాజీ ప్రధానమంత్రి, ఆధునిక భారత నిర్మాణ శిల్పి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, కూసుమంచి గాంధీ చౌక్, సీనియర్ నాయకుడు ఎండీ. హాఫీజుద్దీన్ నందు నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని  నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ  చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన దేశాభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకున్నారు.

యువతకు సాంకేతిక విజ్ఞానాన్ని చేరువ చేయడంలో, దేశాన్ని ఆధునికీకరణ దిశగా నడిపించడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలోఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కూసుమంచి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ హాఫిజ్, సర్పంచ్ లు కొండ కృష్ణవేణి--మహిపాల్, బాణోతు నాగేశ్వరరావు,బదావత్ నరేష్ బొంగా నాయక్,మక్కా రామకృష్ణ, బోడా వీరు నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మరియు మండల నాయకులు, కార్యకర్తలు , అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది.