calender_icon.png 13 May, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన

24-04-2025 02:09:07 AM

అర్మూర్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి) : రాజీవ్ యువ వికాస్ రుణాల కోసం వచ్చిన దరఖాస్తును బుధవారం మున్సిపల్ కమిషనర్ రాజు పరిశీలించారు. పట్టణంలోని  12, 13, 30, 34 వార్డులలో జరుగుతున్న రాజీవ్ యువ వికాస్ దరఖాస్తుల ఇంటికి వెళ్లి  పరిశీలించడం జరిగింది. ఈ పథకం కింద వివిధ కార్పొరేషన్ల ద్వారా 2670 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని రాజు పేర్కొన్నారు. అర్హులైన వారి జాబితాను బ్యాంకర్లకు అందజేయడం జరుగుతుందని అన్నారు. నాన్ బ్యాంకు రంగాలు ఏదైనా ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్ కు పంపించడం జరుగుతుందని పేర్కొన్నా రు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి వెరిఫికేషన్ చేయాలని వార్డ్ ఆఫీసర్లకు సూచించడం జరిగింది. అనర్హులను గుర్తించాలని వార్డు అఫిషర్లకు సూచిం చారు. కార్యక్రమంలో ఆయా వార్డుల ఆఫీస ర్లు, సీనియర్ అసిస్టెంట్ శేఖర్ పాల్గొన్నారు.