calender_icon.png 12 May, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరగాలి

24-04-2025 02:07:06 AM

అర్మూర్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి) : ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడాలని డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ రాజశ్రీ సూచించారు. బుధవారం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన రివ్యూ మీటింగ్ లో డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడాలని కోరారు. సాధారణ ప్రసవాలకు ఎక్కువ ప్యాదాన్యత ఇవ్వాలని కోరారు. డాక్టర్లు మరియు సిబ్బంది  సమయపాలన పాటించాలని ఆసుపత్రికి వచ్చే గర్భవతులకు మరియు రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. వేసవికాలం లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ రమేష్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్, ఎం.సి.హెచ్. ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుప్రియ, డాక్టర్ అపర్ణ, డాక్టర్ స్రవంతి, డాక్టర్ గీత, డాక్టర్ సతీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.