16 April, 2026 | 1:59 PM

రాజ్యసభ వాయిదా

16-04-2026 12:14 PM

న్యూఢిల్లీ: గురువారం నాడు ఎటువంటి శాసనపరమైన కార్యకలాపాలు జరపకుండానే రాజ్యసభ(Rajya Sabha Adjourned ) ఏప్రిల్ 17, 2026న ఉదయం 11:00 గంటల వరకు వాయిదా పడింది. సభ సమావేశం కాగానే, కొత్తగా ఎన్నికైన సభ్యులు ఎగువ సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏప్రిల్ 12న ముంబైలో 92 ఏళ్ల వయసులో కన్నుమూసిన దిగ్గజ నేపథ్య గాయని ఆశా భోంస్లే, అలాగే ఏప్రిల్ 8న 94 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి మొహ్సినా కిద్వాయ్ స్మృత్యర్థం సభ ఒక నిమిషం మౌనం పాటించింది.

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు(Parliament special session) వాడివేడిగా కొనసాగనున్నాయి. కేంద్రం  ప్రభుత్వం 131 రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్‌ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను ప్రవేశపెట్టింది. విపక్షాలు బిల్లులపై అభ్యంతరం చేశాయి. న్యాయశాఖ మంత్రి అర్జున్‌ మేఘవాల్ లోక్‌సభలో డీలిమిటేషన్‌కు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు.