29 August, 2026 | 2:44 AM

అనాథ బాలికలతో రాఖీ వేడుకలు

29-08-2026 01:18 AM

ఆదర్శ ఫౌండేషన్లో ఆత్మీయంగా రాఖీ సెలబ్రేషన్స్

బాలికలతో కలిసి భోజనం చేసిన బీఆర్‌ఎస్ నాయకులు

నాగోల్, ఆగస్టు 28 (విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి సందర్భంగా దిల్సుఖ్నగర్లోని ఆదర్శ ఫౌండేషన్లో అనాథ బాలికలతో కలిసి బీఆర్‌ఎస్ నాయకులు ఆత్మీయంగా రాఖీ వేడుకలు నిర్వహించారు. చైతన్యపురి డివిజన్ బీఆర్‌ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, ఆయన మిత్రులు ప్రసాద్, ప్రశాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొని బాలికలతో రాఖీలు కట్టించుకుని పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.

అనంతరం అనాథ బాలికలతో కలిసి భోజనం చేసి, వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. పండుగ సందర్భంగా బాలికలకు సోదరభావంతో శుభాకాంక్షలు తెలిపారు. అనాథ బాలికలతో కలిసి రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకోవడం ద్వారా ఆత్మీయతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు జలంధర్, చింటు, నాగరాజు, శ్రవణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.