15 July, 2026 | 4:13 PM

Breaking News

యోగాతో మానసిక ప్రశాంతత ఆరోగ్యం   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సురేందర్   •   కల్తీ డీఏపీ ఎరువుల దందా బట్టబయలు   •   ప్రతి విద్యార్థి పాఠశాలలో రాగి జావా తీసుకునే విధంగా చూడండి   •   వికలాంగుల న్యాయమైన హక్కులను అమలు చేయాలి   •   ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసిన కాంగ్రెస్ నాయకులు   •   కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ద్వితీయ వర్ధంతి సభ   •   దేశంలో విద్యా విధానాన్ని కేంద్రం వ్యాపారంగా మార్చింది: మహేశ్ గౌడ్   •   మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో జగ్గారెడ్డి భేటీ.. తుంగతుర్తి అంశాలపై చర్చ!   •   నాటు సారా పట్టివేత... ఒకరి అరెస్ట్   •  

రాఖీ స్పెషల్.. త్వరలోనే రివార్డులు

22-08-2024 01:01 AM
  1. 97 డిపోల్లో 100 శాతం ఓఆర్ 
  2. సిబ్బందిని అభినందించిన ఆర్టీసీ ఎండీ

హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి ఆపరేషన్స్‌లో మెరుగైన పనితీరును కనబరిచిన వారికి త్వరలోనే రివార్డులను  అందజేస్తామని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్  తెలిపారు. అధికారులు, సిబ్బంది పనితనాన్ని యాజమాన్యం గుర్తిస్తుందన్నారు.  సిబ్బంది మెరుగైన పనితీ రుపై చర్చించేందుకు బుధవారం ఆయన బస్‌భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాఖీ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టి దృష్ట్యా కొందరు డ్రైవర్లు బస్సు స్టీరింగ్‌పై కూర్చు ని భోజనం చేసి వృత్తి పట్ల తమ నిబద్దత ను చాటుకున్నారని కొనియాడారు. సిబ్బంది అంకితభావం వల్లే కేవలం 3 రోజుల్లో 1.74 కోట్ల మంది ప్రయాణికుల ను గమ్యస్థానాలకు చేర్చామన్నారు.

భారీ వర్షాల్లోనూ నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేశారని ప్రశంసించారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో 100 శాతానికి పైగా ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) నమోదైందని వెల్లడించారు. మూడు రోజుల్లో 1.07 కోట్ల కిలోమీటర్ల మేర బస్సులు తిరిగాయని పేర్కొన్నారు. గత ఏడాది రాఖీ పౌర్ణమి నాడు 21 డిపోలు 100 శాతానికి పైగా ఓఆర్ సాధిస్తే, ఈ సారి 97 డిపోలు ఆ మైలురాయిని దాటాయని తెలిపారు. ఈ రాఖీ పండుగ రికార్డులన్నింటినీ తిరగ రాసిందన్నారు.

అత్యధిక ఓఆర్ నమోదు చేసిన ఆర్‌ఎం, డీఎంలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్బంగా ప్రయాణి కులకు కృతజ్ఞతలు తెలియజేశారు.  సమావేశంలో సీవోవో డాక్టర్ రవిందర్, జేడీ అపూర్వరావు, ఈడీ మునిశేఖర్,ఫైనాన్స్ అడ్వుజర్ విజయపుష్ఫ, హెవోడీలు శ్రీదేవి, శ్రీధర్, వెంకన్న, సుధాపరిమళ, విజయభాస్కర్, డిప్యూటీ సీటీఎం జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. వర్చ్‌వల్‌గా హైదరాబాద్ అండ్ కరీంనగర్ జోన్ ఈడీ వినోద్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లుతో పాటు ఆర్‌ఎంలు, డిప్యూ టీ ఆర్‌ఎంలు, డీఎంలు హాజరయ్యారు.