22 May, 2026 | 2:15 PM

ప్రాణాలు తీసిన రియాక్టర్

22-08-2024 01:04 AM
  1. అనకాపల్లి జిల్లా ఫార్మా కంపెనీలో 16 మంది మృతి 
  2. మరో 50 మందికి పైగా గాయాలు 
  3. పేలుడు సమయంలో విధుల్లో 387 మంది కార్మికులు 
  4. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం 
  5. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి 
  6. నేడు ఘటనా స్థలానికి సీఎం

హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురంలో ఓ ఫార్మా సెజ్‌లో బుధ వారం భారీ పేలుడు సంభవించింది. సుమారు 500 కిలో లీటర్ల రియాక్టర్ పేలగా 16 మంది మృతి కార్మికులు తీవ్ర గాయాలతో మృతిచెందారు. మరో 50 మందికిపైగా కార్మికు లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విష మంగా మారింది. పేలుడు సంభవించిన సమయంలో 387 మంది విధుల్లో ఉండగా ప్రమాదం సంభవించింది. షిఫ్ట్ మారుతున్న క్రమంలో పేలుడు సంభవించడంతో ప్రాణనష్టం కొంతమేరకు తగ్గింది. పేలుడులో పరిశ్రమ మొదటి అంతస్తు అమాంతం కూలింది. ఒక్కసారిగా దట్టంగా పరిశ్రమలో పొగలు కమ్ముకున్నాయి.

ఏం జరుగుతుందో తేరుకునేలోపే కార్మి కుల మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ఆ తర్వాత పరిశ్రమలో భయానక వాతావరణం నెలకొన్నది. కార్మికులు, యాజమాన్యం దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్రమత్తమైన భద్ర తా సిబ్బంది వెంటనే పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో హుటాహు టిన అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి దేహాలు 60 శాతం వరకు కాలినట్లు వైద్యులు చెప్పినట్లు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం.

ప్రాణభయంతో పరుగులు..

రియాక్టర్ పేలడంతో కార్మికులు ప్రాణ భయంతో పరిశ్రమ బయటకు పరుగులు తీశారు. భారీ శబ్ధంతో సమీప గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. పేలుడు తర్వాత మంటలు ఆర్పేందుకు 11 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి వచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది ఎన్నో ప్రయాసలకోర్చి మంటలను ఆర్పివేశారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందం శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగాయి. పేలుడు ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలుడు ఘటన దురదృష్టకరమ న్నారు. అనకాపల్లి కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అం దేలా చూడాలని ఆదేశిం చారు. ప్రమాదంపై ఉన్న త స్థాయి విచారణకు ఆదేశించారు. కాగా, గురువారం సీఎం చంద్రబాబు అచ్యుతాపురంలో పర్యటించనున్నారు. మృతుల కుటుంబాలకు పరామర్శించనున్నారు. పేలుడ ఘటనపై ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్ స్పందిస్తూ.. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నామని, కలెక్టర్, ఎస్పీతో ఎప్పటి కప్పుడు మాట్లాడుతూ పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు. మృతుల వివరాలు పూర్తిగా తెలుసుకునేందుకు ప్రభుత్వానికి కొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు.