8 August, 2026 | 1:14 AM

తన్వి శర్మకు రక్షిత షాక్

08-08-2026 12:00 AM

సెమీస్‌లో అస్మితతో పోరు

కొరియా మాస్టర్స్ టోర్నీ

అసన్ సిటీ, ఆగస్టు 7: భారత బ్యాడ్మింటన్ యువ సంచలనం తన్వి శర్మకు షాక్ తగిలింది. మరో భారత షట్లర్ రక్షిత రామరాజ్ తన్విపై సంచలన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో రక్షిత 18 21 21 స్కోరుతో తన్విని ఓడించింది. తొలి గేమ్ గెలిచి జోరు మీద కనిపించిన తన్వీకి తర్వాత వరుస గేమ్స్‌లో రక్షిత షాకిచ్చింది.

ఈ గేమ్స్ కూడా నువ్వా నేనా అన్నట్టు సాగాయి. రెండో గేమ్‌లో చివరి ఐదు పాయింట్ల దగ్గర రక్షిత దూకుడుగా ఆడి పైచేయి సాధించింది. నిర్ణయాత్మక మూడో గేమ్ చివర్లో తన్వి చేసిన తప్పిదాలతో రక్షిత మ్యాచ్‌ను సొంతం చేసుకుని సె మీఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్‌లో రక్షిత, అస్మిత తలపడనున్నారు. అంతకుముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో అస్మిత చలిత టాప్ సీడ్ హినా అకెచికి షాకిచ్చింది. హోరాహోరీగా సాగిన పోరులో ఆమె 20 21 21 స్కోరుతో విజయం సాధించింది.

తొలి గేమ్ కోల్పోయి వెనుకబడినా తర్వాత అద్భుతంగా పుంజుకుని గెలిచింది. ఇదిలా ఉంటే మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డ బుల్స్‌లో భారత్ పోరాటం ముగిసింది. మ హిళల డబుల్స్ జోడీ సోనాలి సింగ్,రితిక 15 9 స్కోరుతో ఏడో సీడ్ జపాన్‌కు చెందిన సుమిరె, టకహాషి చేతిలో పరా జయం పాలైంది. అలాగే మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆరో సీజన్ ఇశాన్ జోడీ కూడా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లో పృథ్వి కృష్ణమూర్తి రాయ్, కృష్ణప్రసాద్ జోడీ సైతం ఇంటిదారి పట్టింది.