8 August, 2026 | 1:17 AM

కోహ్లీ వల్లే స్వర్ణం గెలిచా

08-08-2026 12:00 AM

బాక్సర్ సాక్షిచౌదరి కామెంట్స్

న్యూఢిల్లీ, ఆగస్టు 7: భారత క్రికెట్‌లో సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఇతర క్రీడలకు చెందిన ప్లేయర్స్‌కు సైతం ఎన్నోసార్లు మద్ధతుగా నిలిచాడు. తాజాగా భారత మహిళా బాక్సర్ సాక్షి చౌద రి విరాట్ కోహ్లీకి కృతజ్ఞతలు తెలిపింది. ఇటీవల గ్లాస్గో వేదికగా జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్ బాక్సింగ్ 51 కేజీల విభాగంలో ఆమె స్వర్ణం గెలిచింది. కోహ్లీ వల్లనే తాను బంగారు పతకం గెలవగలిగానని సాక్షి తెలిపింది. తన గెలుపులో కోహ్లీ కీలక పాత్ర పోషించాడని పేర్కొంది. విజేందర్‌సింగ్‌ను చూసి బాక్సింగ్ ప్రారంభించిన తనకు కోహ్లీ ఆర్థికసాయం అందించారని గుర్తు చేసుకుంది.