1 March, 2026 | 7:28 PM

భూదాన్ భూముల్లో పర్యటించిన రామచందర్ రావు

01-03-2026 05:24 PM

హైదరాబాద్: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు ఆదివారం పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల నిరాశ్రయులై, ఖమ్మం అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఆశ్రయ కేంద్రంలో తలదాచుకుంటున్న బాధిత కుటుంబాలను ఈరోజు పరామర్శించాను.  వెలుగుమట్ల భూదాన్ భూములను ఆయన పరిశీలించి, భూ నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ... భూదాన్ బోర్డు పట్టాలున్న పేదల ఇళ్లను నోటీసులు కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. పేదల వ్యతిరేక ప్రభుత్వం అని, నోటీసులు కూడా ఇవ్వకుండా పేదల ఇళ్లు కూలగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించింది..? అని ప్రశ్నించారు. పేదల వెంట బీజేపీ ఉండి పోరాడుతుందని, ఇల్లు కూల్చిన చోట పేదలకు 100 గజాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే పేదలను భూదాన్ భూముల నుంచి పంపించేస్తున్నారని, వారు పడుతున్న కన్నీటి వేదన, మాటలకందని ఆవేదన ప్రస్తుత ప్రభుత్వ క్రూరత్వానికి సజీవ సాక్ష్యాలు అని చెప్పారు. 

ప్రజల పక్షాన, న్యాయం కోసం ప్రశ్నించే గళాన్ని ఎవరూ అణచివేయలేరని, "కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి ఇక్కడి నుంచే నాంది" అని స్పష్టం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పేదల హక్కుల కోసం బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని రామచందర్ రావు భరోసా ఇచ్చారు.  తొలి క్షణం నుండి బాధితులకు కొండంత అండగా నిలబడి, వారికి ఆశ్రయ కేంద్రంలో నిరంతర అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న ఖమ్మం జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు నా ప్రత్యేక అభినందనలు తెలిపారు.