21 March, 2026 | 8:04 PM

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ మట్ట దయానంద్

21-03-2026 04:24 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణ పరిధిలోని ఈద్గాలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ ముస్లిం సోదరులతో కలిసి  ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో   కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం సోదరులకు  అన్ని విధాల తోడుగా అండగా ఉంటుంది.

వారి అభివృద్ధికి సహకరిస్తుందని రంజాన్ పండుగ సందర్భంగా తెలియజేశారు... తెలంగాణ రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి పథకాలు అర్హులు గల ప్రతి ఒక్కరికి అందుతాయన్నారు.  రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి సత్తుపల్లి పట్టణంలో ముస్లిం మహిళకు మున్సిపల్ కమిషనర్ రిహానా బేగం కమల్ పాషాని మించడం జరిగిందని ముస్లిం సోదరులకు తెలియజేశారు. సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మునిసిపాలిటీ అభివృద్ధి చెందుతుందని హామీ ఇచ్చారు.           

సత్తుపల్లి పట్టణంలో అతి త్వరలో షాదీఖానా, ఈద్గా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహానా బేగం కమలపాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత, ముస్లిం కౌన్సిలర్స్ గ్రాండ్ మౌలాలి, హకీమ్, షరీఫ్ మరియు సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్స్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదు చెన్నారావు, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

38వ డివిజన్లో తుమ్మల యుగంధర్

రంజాన్ పండగను పురస్కరించుకొని ఖమ్మం పట్టణ పరిధిలోని 38వ ఖిల్లా మసీదులో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులకు అలాయబలై అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఏరగర్ల హనుమంతరావు కాంగ్రెస్ నా పార్టీ నాయకులు నాగండ్ల దీపక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.