21 March, 2026 | 7:41 PM

కోనరావుపేట మండలంలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు

21-03-2026 04:26 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో శనివారం రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే మసీదులకు చేరుకున్న భక్తులు ప్రత్యేక నమాజ్‌లు నిర్వహించి, దేశం శాంతి, సౌభ్రాతృత్వాలతో అభివృద్ధి చెందాలని ప్రార్థనలు చేశారు.

రంజాన్ సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొని, చిన్నా పెద్దలు ఆనందంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి, సౌహార్ద వాతావరణంలో పండుగను జరుపుకోవడాన్ని అభినందించారు.