మైనార్టీల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కృషి
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్, మార్చి 21 (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా, శనివారం కాజీపేట 63వ డివిజన్ లోని ఈద్గా మైదానంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం సహనం, దానధర్మాలు, సోదరభావానికి ప్రతిక అని, సమాజంలో ఐక్యత మరింత బడపడాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ముస్లిం సోదరుల విద్యా, ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ప్రతి వర్గానికి సమాన న్యాయమందించే దిశగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు సిరిసిల్ల రాజయ్య, డాక్టర్ రియాజ్, 62 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ రజాలి, స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.




