15 April, 2026 | 1:41 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ

30-03-2025 10:56 PM

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్..

ఖానాపూర్ (విజయక్రాంతి): భారతదేశం భిన్న సంస్కృతులకు నిలయమని, మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం, ఖానాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూసుఫ్ ఖాన్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. అందరూ సోదర భావంతో పండగ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జహీర్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, అంకం రాజేందర్, వైస్ చైర్మన్ కావలి సంతోష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మజీద్, కడాల గంగ నరసయ్య తదితరులు ఉన్నారు.