1 July, 2026 | 7:08 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

రామగుండాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధిలో ప్రథమ స్థానంగా నిలుపుతా

16-06-2025 12:36 AM

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

నా చిన్ననాటి స్నేహితుడు మంత్రి కావడం సంతోషంగా ఉంది:  రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ 

గోదావరిఖని జూన్ 15(విజయ క్రాంతి): నా చిన్ననాటి స్నేహితుడు మంత్రి కావడం చాలా సంతోషంగా ఉందని రామగుండం  ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఆదివారం రాష్ట్ర మంత్రిగా బాధితులు చేపట్టిన అనంతరం తొలిసారి గోదావరిఖనికి వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికారు.

రామగుండం మున్సిపల్ కార్యాల యం ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూరాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సింగరేణి ప్రాంత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తొలిసారి రామగుండంకు విచ్చేసిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి, ఆయనకు స్వాగతం పాలికి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించా రు.ఈ సందర్భంగా మంత్రి తో కలిసి ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్  బాబు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల, వృద్ధుల సంక్షే మ ట్రాన్స్ జెండర్ల సాధికారత శాఖ మం త్రిగా మా రామగుండం నియోజకవర్గానికి రావడం చాలా సంతోషకరంగా ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రామ గుండం నియోజకవర్గం ప్రత్యేక స్థానం దక్కించుకోవాలని స్థానిక నాయకుల నిబంధన ప్రజల సహకారం ద్వారా మన ప్రాం తం అభివృద్ధి సాధ్యమవుతుందని, మన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం మన ప్రాధాన్యతకు నిదర్శనం అని పేర్కొన్నారు.

అనంతరంమంత్రి మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గాన్ని రా ష్ట్రంలో అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని, మౌలిక వసతులు మెరుగుదల యువతకు ఉపాధి అవకాశాలు విద్యా ఆరోగ్యారంగంలో సరైన ప్రాణాలిక అమలుతో మేము ముందుకు పోతామన్నారు.

ముఖ్యమంత్రి సహకారంతో అన్ని వర్గాల అభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు అంతర్గాం, పాలకుర్తి మండ లంలోని  సీనియర్ వివిధ విభాగాల అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు అధిక సం ఖ్యలో పాల్గొన్నారు.