12 May, 2026 | 2:06 AM

జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా రామాంజి గౌడ్

12-05-2026 01:07 AM

గరిడేపల్లి, మే 11 : సూర్యాపేట జిల్లా సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షుడిగా మండలంలోని రాయినిగూడెం సర్పంచ్ గుండు రామాంజి గౌడ్ ఎంపికచేసి ఈ మేరకు నియామక పత్రంను రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడు  కాయితి ఆశాదీప్ రెడ్డి అందజేసినట్టు సోమవారం ఆయన విలేకరులకు తెలిపారు.

ఈ సందర్భంగా రామాంజి గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకముంచి జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డికి, తుంగతుర్తి ఎమ్మెల్యే మం దుల సామేలు, నాయకులు సర్వోత్తమ్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, వేణారెడ్డిలతో పాటు పలువురు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని సర్పంచులందరినీ సమన్వ యం చేసుకుంటూ గ్రామాల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాన న్నారు. కాగా రామంజి గౌడ్ ని పలువురు అభినందించారు.