calender_icon.png 16 February, 2026 | 10:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివనామస్మరణతో మారుమ్రోగిన రామప్ప

16-02-2026 12:06:57 AM

  1. రామప్పలో ఆధ్యాత్మిక కాంతి

తెల్లవారుజాము నుంచే భక్తుల క్యూలైన్లు

భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు

రాత్రంతా జాగరణ..హృదయాల్లో శివధ్యానం

వైభవంగా శివపార్వతుల కల్యాణం

జాగరణతో నిండిన శివరాత్రి వేడుకలు

ములుగు,ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రఖ్యాత శైవక్షేత్రమైన రామప్ప ఆల యంకు భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు క్యూలైన్లలో నిలబడి శివదర్శనం కోసం వేచి చూశారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భ క్తులు ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకాలు, లింగార్చనలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో పూ జలు చేశారు. అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శివనామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

ప్రత్యేక పూజలు, అభిషేకాలు

మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో రుద్రాభిషేకాలు, లింగార్చనలు, మహామంగళహారతులు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొని శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శివనామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

రాత్రంతా జాగరణ..హృదయాల్లో శివధ్యానం

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో రాత్రంతా జాగరణ ని ర్వహించారు. భజనలు, కీర్తనలు, దీపారాధనలతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వా దించారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారి దర్శనం భక్తులను ఆకట్టుకుంది. భక్తుల హృదయాల్లో శివధ్యానంతో నిండిపోయింది.

వైభవంగా శివపార్వతుల కల్యాణం

రామప్ప ఆలయ ఆవరణలో అంగరంగ వైభవంగా రాత్రి 10 గంటలకు శివపార్వతు ల కల్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకుడు కోమళ్లపల్లి హరీష్ శర్మ, అర్చకుడు ఉమాశంకర్లు జరిపించారు. స్వామివా రి కల్యాణానికి పట్టువస్త్రాలు ఆలయ ఈఓ బిల్లా శ్రీనివాస్, ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మిల్కురి ఐలయ్య ఆధ్వర్యంలో ఆలయ అర్చకుడు కల్యాణ తంతు జరిపించారు. ఈ వేడు కలో పలు దంపతులతో పాటు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

మహాశివరాత్రి వేడుకల సందర్భంగా రా మప్ప ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తి గీతాలు, హరి నామ సంకీర్తనలు, నృత్య ప్రదర్శనలు, హరతుల కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించా యి. స్థానిక కళాకారులు శివతాండవ నృత్యాలతో, భక్తి నాటికలతో ఆధ్యాత్మిక భావాన్ని ప్రతిబింబించారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు కార్యక్రమాలను ఆస్వాదిస్తూ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఆలయ ప్రాంగణం కళా-సాంస్కృతిక వాతావరణంతో కళకళలాడింది.

రామప్పలో భక్తుల కోసం ఆరోగ్య సేవలు

మహాశివరాత్రిని పురస్కరించుకుని రామ ప్ప దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందుబాటు లో ఉంచారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెంకటాపూర్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.

మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయానికి విచ్చేస్తు న్న భక్తులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలతో వైద్య బృందం సేవలందిస్తోంది. శిబిరంలో సాధారణ వైద్య పరీక్షలు, రక్తపోటు, షుగర్ పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేస్తు న్నారు. వైద్యులు, సిబ్బంది భక్తులకు తక్షణ చికిత్స అందిస్తూ అప్రమత్తంగా విధు లు నిర్వర్తిస్తున్నారు. భక్తులు ఈ ఆరోగ్య సేవలను వినియోగించుకోవాలని వైద్య సిబ్బం ది కోరారు.

భక్తులకు పండ్లు పంపిణీ చేసిన ఆలయ చైర్మన్

మహాశివరాత్రి సందర్భంగా రామప్ప ఆలయంకు తరలివచ్చిన భక్తులకు స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం వారికి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మిల్కూరి ఐల య్య పండ్లు పంపిణీ చేశారు. దర్శనానికి వ చ్చిన భక్తులకు స్వయంగా పండ్లు అందజేసి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది మరియు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

కొబ్బరికాయల ధరలపై భక్తుల ఆగ్రహం

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా వే లాదిగా భక్తులు తరలివస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం దూర ప్రాంతాల నుం చి వచ్చే భక్తులు మొక్కులు తీర్చుకుంటూ కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. అయితే, ఆలయ పరిసరాల్లో కొబ్బరికాయల వ్యాపారులు అధిక ధరలకు అమ్ముతున్నారంటూ భక్తులు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు.

బయట మార్కెట్లో రూ.25కి లభించే కొబ్బరికాయను ఇక్కడ రూ.50కు విక్రయిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీంతో భక్తులు ఇ బ్బందులు పడుతున్నారని, ధరలను నియంత్రించేందుకు సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నా రు. ఉత్సవాల సందర్భంగా వ్యాపారులు అ ధిక ధరలు వసూలు చేయకుండా పర్యవేక్షణ పెంచాలనిఅధికారులకువిజ్ఞప్తి చేస్తున్నారు.