16-02-2026 12:03:38 AM
జవహర్ నగర్లో వాలీబాల్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం
వెంకటాపూర్, ఫిబ్రవరి15 (విజయక్రాంతి):క్రీడలతో యువతలో స్నేహభావం, ఐక్యత పెంపొందుతుందని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని జవహర్ నగర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన జవహర్ నగర్ వాలీబాల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1 పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న బాదం ప్రవీణ్, అనంతరం మైదానంలోకి దిగి కాసేపు వాలీబాల్ ఆడి యువతను ఉత్సాహపరిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు.
మహాశివరాత్రి సందర్భంగా గ్రామంలో క్రీడలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను కొనియాడారు. యువత సన్మార్గంలో నడవాలని, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బాదం ప్రవీణ్కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆర్గనైజర్ కిరణ్, హతీష్, మనోజ్, భాస్కర్, రవికుమార్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.