రామోజీరావు అస్తమయం
08-06-2024 10:00 AM
హైదరాబాద్: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు (88) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు రామోజీరావు తుదిశ్వాస విడిచారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం తరలించారు. 1936 నవంబర్ 16 కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.






