1 September, 2026 | 4:38 PM

రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది: సీఎం రేవంత్ రెడ్డి

08-06-2024 10:21 AM

హైదరాబాద్: ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత  చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత రామోజీరావుకే దక్కుతుందని సీఎం కొనియాడారు.

తెలుగు పత్రికా,మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు.రామోజీరావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.