‘రణబాలి’ దసరాకే

28-08-2026 | 12:00am

విజయ్‌దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandann) జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి‘(Ranabali). ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్నాయి.

సెప్టెంబర్ 11న రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ మేరకు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో విజయ్ దేవరకొండ చేతిలో కత్తితో ఫెరోషియస్‌గా కనిపించి ఆకట్టుకుంటున్నారు.  గుల్షన్‌కుమార్, భూషణ్‌కుమార్, టీ సిరీస్ ఫిలింస్ సమర్పిస్తున్న ఈ సినిమాలో ఆర్నాల్ వోస్లూ కీలక పాత్రను పోషిస్తున్నారు. 

మరిన్ని వార్తలు