14-01-2026 06:21:58 PM
కొత్తగూడెంలో ముగ్గుల పోటీలు కనిపించిన మహిళల ప్రతిభ పట్ల హర్షం
తుంగతుర్తి,(విజయక్రాంతి): సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని కర్విరాల కొత్తగూడెం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ ఎంతగానో అలరించింది.ముగ్గుల పోటీలో చిన్న పెద్ద తేడా లేకుండా పిల్లలు, విద్యార్థులు, మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని గత పదేండ్ల గల బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముగ్గుల రూపంలో ఆనందాన్ని వ్యక్తపరిచారు. ముఖ్యంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్, రైతుబంధు లాంటి పథకాల విశిష్టతను తెలియజేసే ముగ్గులు అందరిని ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కలవరిచి పోటీలో విజేతలుగా నిలిచిన వారికి అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతుల దాతగా ముందుకు వచ్చిన దాచెపల్లి బ్రదర్ వెంకట్ రెడ్డి, సింగారెడ్డి గారు, తుంగతుర్తి మాజీ వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్, గ్రామ సర్పంచ్ మేడుదల రమేష్, ఉప సర్పంచ్ పాండవుల మహేష్, బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు, గ్రామ కమిటి సభ్యులు,గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.