14-01-2026 06:17:58 PM
వాంకిడి,(విజయక్రాంతి): మండలం ఖిరీడి గ్రామ శివారులోని సమ్మెల భీమయ్య దేవాలయాన్ని సందర్శించిన ప్రజా సంఘాల నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సాటి మాసంలో భీమయ్య జాతరను గిరిజనులు ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు సరైన రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు దేవాలయానికి చేరుకోవడంలో నానా కష్టాలు పడాల్సి వస్తోందన్నారు. అలాగే దేవాలయ పరిసరాల్లో త్రాగునీటి సౌకర్యం లేకపోవడంతో ఎడ్లబండ్లపై నీటిని తరలించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భీమయ్య జాతరకు వెళ్లే మార్గంలో రోడ్డు నిర్మాణంతో పాటు శాశ్వత త్రాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.