14-01-2026 06:26:31 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా పర్యటనకు వచ్చిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డికి బుధవారం నిర్మల్ లో ఘన స్వాగతం లభించింది. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కు చేరుకున్న వీరికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి షర్మిల డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బుజ్జి పటేల్ మాజీ మంత్రి ఇంద్రకన్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాచారి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ హరిరావు గ్రంథాలయ చైర్మన్ అర్జుమాత్ తదితరులు స్వాగతం పలికారు.
పుష్పగుచ్చం అందించి పూల మొక్కను బహుకరించారు అనంతరం గెస్ట్ హౌస్ లో నిర్మల్ అదిలాబాద్ జిల్లా చెందిన కాంగ్రెస్ నేతలు మున్సిపల్ లో ఎన్నికల్లో పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థులు కలిసి పుష్పగుచ్చం అందించారు జిల్లా పర్యటనపై ఆయన చర్చించారు ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలన్నారు అంతకుముందు పోలీసుల గౌరవ వందలని మంత్రి జూపల్లి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి స్వీకరించారు