23 March, 2026 | 9:56 AM

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని

18-09-2024 12:11 AM
  1. ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 
  2. ఈ నెల 8న ముగిసిన  పార్థసారథి పదవీ కాలం 
  3. మూడేళ్ల పాటు ఎస్‌ఈసీగా కొనసాగనున్న కుముదిని

హైదరాబాద్, సెప్టెంబర్ 17(విజయక్రాంతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారిణి రాణి కుముదిని నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదేశాలు జారీ చేశారు. 1988 బ్యాచ్‌కు చెందిన రాణి కుముదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. రాణి కుముదిని ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నూతన ఎస్‌ఈసీ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.

రాణి కుముదిని కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పదవీ విరమణ చేశారు. తాజాగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆమె నియామకానికి ఆమోదముద్ర వేసింది. ఇప్పటీ వరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న పార్థసారథి 2020, సెప్టెంబర్ 9న బాధ్యతలు చేపట్టారు. 2023 సెప్టెంబర్ లో పదవీకాలం పూర్తి కాగా కేసీఆర్ ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని ఏడాదిపాటు పొడగించింది. తాజాగా పదవీకాలం ముగియడంతో కొత్త కమిషనర్‌గా రాణి కుముదిని నియమకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు.