13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

అన్న దాత కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా

23-03-2026 01:21 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): అన్నదాత కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుభరోసా నిధుల విడుదల చేపథ్యంలో ఆదివారం ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు. ‘అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా. రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నా.

70 లక్షల మంది రైతన్నల కోసం రూ.9,000 కోట్ల రైతుభరోసా నిధుల విడుదలకు ఆదివారం శ్రీకారం చుడుతున్నాం. సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ పథకాన్ని అమలుచేస్తున్నాం. ఆర్ధిక సాయంతో చేతులు దులుపుకోవడం కాదు కేవలం 17 నెలల వ్యవధిలో పామ్ ఆయిల్ పరిశ్రమ మొదలు పెట్టి, పూర్తిచేసి రైతు లోకానికి అంకితం చేస్తున్నాం. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్నాం’ అని సీఎం పోస్ట్‌చేశారు.