18 July, 2026 | 3:24 PM

బోర్డ గ్రామంలో ర్యాపిడ్ ఫీవర్ సర్వే

18-07-2026 03:24 PM

వాంకిడి, (విజయక్రాంతి): ర్యాపిడ్ ఫీవర్ సర్వే కార్యక్రమంలో భాగంగా వాంకిడి మండలం బెండార ఆరోగ్య ఉపకేంద్రం పరిధిలోని బోర్డ గ్రామంలో శనివారం ఇంటింటి జ్వర సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వాంకిడి మండలం ఆరోగ్య విస్తరణ అధికారి రవిదాస్ వర్షా కాలంలో దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, ఫైలేరియా, మెదడువాపు వంటి వ్యాధుల నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు ఆయన సూచించారు.

తాగునీటిని కాచి చల్లార్చి తాగాలని, ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలను సంప్రదించా లని తెలిపారు. గ్రామస్తులకు ఇంటింటి ఫీవర్ సర్వే, డ్రై డే నిర్వహణపై అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన వైద్య శిబిరంలో 46 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీ సుచరిత, ఏఎన్‌ఎం విజయ, ఆశా, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.