18 July, 2026 | 3:17 PM

Breaking News

10వ డివిజన్‌లో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

18-07-2026 03:17 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ 10వ డివిజన్ కార్పొరేటర్  సౌగాని కొమరయ్య  ఆధ్వర్యంలో అపోలో రీచ్ హాస్పిటల్  సహకారంతో కట్టరాంపూర్‌లోని 10వ డివిజన్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్  మరియు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్,  యాదగిరి సునీల్ రావు  హాజరై క్యాంపును ప్రారంభించారు. అనంతరం స్వయంగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకుని, శిబిరంలోని సౌకర్యాలను పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో డా. తిరునాధర్ జనరల్ ఫిజీషియన్,డా. సుబ్రత్ కుమార్ సోరెన్ న్యూరో & స్పైన్ సర్జన్ లు సేవలందించారు.ఈ శిబిరంలో స్థానిక ప్రజలు  పాల్గొని వైద్యులు అందించిన సేవలను సద్వినియోగం చేసుకున్నారు.