18 July, 2026 | 3:20 PM

జూనియర్ కళాశాల తనిఖీ

18-07-2026 03:20 PM

డీఐఈఓ బి. రాందాస్

వాంకిడి,(విజయక్రాంతి): కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) బి. రాందాస్ శనివారం వాంకిడి మండల కేంద్రంలోని  ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కళాశాల రికార్డులను పరిశీలించి, ప్రిన్సిపల్ సీహెచ్. తిరుపతి, అధ్యాపకులతో సమావేశమయ్యారు. కళాశాల విద్యా ప్రగతి, విద్యార్థుల హాజరు, మొదటి సంవత్సరం ప్రవేశాల పరిస్థితిపై ఆరా తీశారు. ప్రవేశాల పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు డీఐఈఓను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.