వేగంగా ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్
కలెక్టర్ స్నేహ శబరిష్
మహబూబాబాద్, జులై 15 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసే కార్యక్రమం పూర్తి చేశామని, ఓటర్లు తిరిగి ఇచ్చిన ఫారాలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతుందని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కురవి మండల కేంద్రంలో కొనసాగుతున్న ఎస్ ఐ ఆర్ సవరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి బూత్ లెవల్ అధికారులు వెళ్లి వివరాలు సేకరించి 2002 ఓటరు జాబితా ప్రకారం వివరాలు సేకరించాలని, అందుబాటులో లేని వివరాలను గుర్తించాలని, వేగంగా ఈ ప్రక్రియ మొత్తం కొనసాగాలని ఆదేశించారు.
ఇప్పటికే జిల్లా స్థాయి ప్రత్యేక అధికారులను నియమించి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగడంలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా సహకరించాలని కోరారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ విజయ, ఎంపీడీవో వీరబాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






