14 July, 2026 | 6:53 PM

Breaking News

కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •  

వేగంగా ఆవిరవుతున్న విదేశీ మారక నిల్వలు

02-11-2024 12:00 AM

మరో 3.4 బిలియన్ డాలర్ల తగ్గుదల 

 న్యూఢిల్లీ, నవంబర్ 1:  దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు రికార్డు గరిష్ఠస్థాయి నుంచి వరుసగా నాలుగో వారమూ తగ్గా యి. శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గ ణాంకాల ప్రకారం  అక్టోబర్ 25తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రి జర్వులు మరో 3.4 బిలియన్ డాలర్లు తగ్గి 684.8 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి..

సెప్టెంబర్ చివరినాటికి ఫారెక్స్ నిల్వలు 704.885 బిలియన్ డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.  ఆ స్థాయి నుంచి వరుస 4 వారాల్లో  దాదాపు 20 బిలియన్ డాలర్లకుపైగా క్షీణించాయి. తాజాగా అక్టోబర్ 25తో ముగిసిన వారం లో విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 4.48 బిలియన్ డాలర్లు తగ్గి 593.75 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. 

పెరిగిన బంగారం నిల్వలు

ఆర్బీఐ వద్దనున్న బంగారం నిల్వలు  సమీక్షావారంలో  1  బిలియన్ డాలర్లు పెరిగి 68.5 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 52 మిలియన్ డాలర్లు తగ్గి18.2 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు 9 మిలియన్ డాలర్ల క్షీణతతో 4.3 బిలియన్ డాలర్ల వద్దకు తగ్గాయి.