calender_icon.png 22 May, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు మహర్దశ

30-11-2024 11:28:45 AM

కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ వెల్లడి

కోదాడ, (విజయక్రాంతి): ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాతో  కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఎంఓయు సాంకేతిక మార్పిడి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ... హైదరాబాదులో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో కోదాడ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలకు ఈ అరుదైన అవకాశం దక్కిందన్నారు ఈ ఒప్పందంతో కళాశాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూర్తుందన్నారు కళాశాల విద్యార్థినిలకు సాంకేతిక శిక్షణలు సెమినార్లు వర్క్ షాపులు దీర్ఘకాలిక సర్టిఫికెట్ కోర్సులు ఈ ఒప్పందం ఫలితంగా చేకూర్తాయన్నారు మూడు సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని విద్యార్థినిలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాగా కాన్ఫరెన్స్కు కళాశాల డైరెక్టర్ సిహెచ్ నాగార్జున రావు హెచ్ ఓ డి డాక్టర్ పత్తి జనార్ధన్ హాజరయ్యారు