30-11-2024 11:34:34 AM
అమిస్తాపూర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారంనాడు మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ లో జరుగుతున్న 'రైతుపండగ'కి రానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో బేగంపేట నుంచి బయలుదేరి 3:30కి భూత్పూరు చేరుకుంటారు. 4:15 నిమిషాలకు సభాస్థలికి చేరుకొని 4:30గంటలకు ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి జిల్లా నేతలు పెద్ద ఎత్తున జన సమీకరణకు సిద్ధమయ్యారు.