28 May, 2026 | 1:54 AM

కేర్‌లో అరుదైన శస్త్రచికిత్స

28-05-2026 12:29 AM

84 ఏళ్ల వృద్ధురాలికి అత్యంత సంక్లిష్ట గుండె చికిత్స

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): తీవ్ర గుండె సమస్య, కిడ్నీ వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 84 ఏళ్ల వృద్ధురాలికి కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ వైద్యులు అత్యంత సంక్లిష్ట గుండె శస్త్రచికిత్స చేసి మళ్లీ సాధారణ జీవితానికి తీసుకువచ్చారు.

అనంత పూర్‌కు చెందిన సుబ్బరత్నమ్మ అనే వృద్ధురాలు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు, గుం డె వైఫల్యంతో తరచూ ఆసుపత్రిలో చేరుతూ వచ్చారు. పరిస్థితి విషమించడంతో కూర్చు న్నా, పడుకున్నా తీవ్ర శ్వాస ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఊపిరి తీసుకోవడానికి నిరంతరం ఆక్సిజన్ అవసరమయ్యేది. తీవ్రమైన బలహీనత కారణంగా స్వయంగా నడవలేని స్థితికి చేరుకుని దాదాపు మంచానికే పరిమితమయ్యారు. పరీక్షల్లో ఆమెకు మైట్ర ల్ వాల్వ్ తీవ్రంగా దెబ్బతినడంతో పాటు పల్మనరీ హైపర్టెన్షన్ ఉన్నట్లు గుర్తించారు.

అలాగే కిడ్నీ పనితీరు తీవ్రంగా తగ్గిపోయి ఈజీఎఫ్‌ఆర్ కేవలం 15 మాత్రమే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో సాధారణ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం అత్యంత ప్రమాదకరంగా మారింది. వయస్సు, బలహీనత, కిడ్నీ సమస్యల కారణంగా పలుచోట్ల శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు వెనుకంజ వేసినట్లు తెలిపారు. పరిస్థితి రోజురోజుకూ విషమించడంతో చివరి ఆశగా కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీని ఆశ్రయించినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.

కార్డియాక్ సర్జన్లు, కార్డియాలజిస్టులు, అనస్థీషియా, నెఫ్రాలజీ నిపుణులు కలిసి కేసును సమగ్రంగా పరిశీలించి మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ ద్వారా మైట్ర ల్ వాల్వ్ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ శస్త్రచికిత్స విజయవంతమైంది. మొదటి రోజే వెంటిలేటర్ నుంచి బయటకు తీసినట్లు వైద్యులు తెలిపారు. ఆక్సిజన్ లేకుండానే ఊపిరి పీల్చుకోగలిగారని  హైటెక్ సిటీ లోని కేర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ వాస్క్యులర్, మినిమల్లీ ఇన్వేసివ్, ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రవిరాజు చికుల్లపల్లి, క్యాథ్ల్యాబ్ డైరెక్టర్, సీనియ ర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వి వినోద్ కుమార్ వెల్లడించారు.