20-09-2025 08:21:20 AM
65 ఏళ్ల మహిళ నుంచి 8 కిలోల కాంప్లెక్స్ ఓరియేషన్ ట్యూమర్ తొలగింపు
ఇది రెండో ప్రధాన శస్త్ర చికిత్స
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో నిపుణుల వైద్యుల బృందం 65 ఏళ్ల మహిళ నుంచి 8 కిలోల కాంప్లెక్స్ ఓరియేషన్ ట్యూమర్ను విజయవంతంగా తొలగించారు. ఆసుపత్రిలో ఇది రెండో అరుదైన ప్రధాన శస్త్ర చికిత్స. రోగి శస్త్య చికిత్స నిమిత్తం అనేక ప్రవేశ ఆసుపత్రులలో తిరిగి ఎక్కడ శస్త్ర చికిత్స చేయడం కష్టమని వైద్యులు చెప్పడంతో సింగరేణి ప్రధాన ఆసుపత్రికి వచ్చారు. రోగిని పరీక్షించిన వైద్యుల బృందం కంబైండ్ స్పెషల్, ఎపిడ్యూరల్ అనస్థీషియా నిర్వహించారు. రోగి హై పవర్ టెన్షన్ అనీమియా ఇతర
మోరిప్డీలతో ఆసుపత్రిలో చేరారని వైద్యులు తెలిపారు. వైద్యుల బృందం క్షుణ్ణంగా పరిశీలించి శాస్త్ర చికిత్సకు సిద్ధం చేసి సఫలీకృతం అయ్యారు. ఈ ఆసుపత్రిలో ఈనెల12వ తేదీన కాంప్లెక్స్ ఓరియేషన్ ట్యూమర్ను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో వరుసగా రెండు ప్రధాన శాస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించడం సింగరేణి ప్రధాన ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం, అత్యాధునిక వైద్య సదుపాయాలు మరొకమారు నిరూపించాయి. ఈ శస్త్ర చికిత్సలో సింగర్ అనే ప్రధాన ఆసుపత్రి గైనకాలజిస్ట్ మాలతి, జనరల్ సర్జన్ వినూత్న, అనస్టీయ లిస్ట్ కాలేశ్వర్, కృష్ణమూర్తి రవళి పాల్గొన్నారు. సర్జరీ విజయవంతం చేసిన వైద్య బృందాన్ని చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్, అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉష అభినందించారు.