20-09-2025 09:59:43 AM
భూస్వామ్య, పెత్తందారుల్లారా ఖబడ్డార్
మీ అగడాలను కూకటి వేళ్ళతో పెకిలిస్తాం
భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కొందరు ప్రముఖుల పేర్లతో స్ట్రాంగ్ వార్నింగ్
చర్ల, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో మావోయిస్టులు కొందరు ప్రముఖులను హెచ్చరిస్తూ మావోయిస్ట్ లేఖ చేశారు, లేఖ సారాంశం ఇలా ఉంది విప్లవోద్యమంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పాశివిక దాడులతో మావోయిస్టుపార్టీపై భూస్వామ్య, పెత్తందారులు చేస్తున్న ఆసత్య ప్రచారాన్ని మానుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరుతో లేఖను విడుదల చేశారు. విప్లవోద్యమంపై భూస్వామ్య, పెత్తందారుల విథానాలు మళ్ళీ హెచ్చరిల్లుతున్నాయని. ఈ క్రమంలో పేదలు, సామాన్యులు, మధ్య తరగతి ప్రజలపై ఆయా వర్గాలు పెట్రేగి పోతున్నాయని మండిపడ్డారు. ప్రజలపై జరుగుతున్న ఈ దాడులను మావోయిస్టుపార్టీ చూస్తూ ఊరుకోదని, భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో కొందరు పెత్తందారులు ఈ పోకడలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో రాజకీయ బ్రోకర్లతో కలిసి పెత్తందారులు, భూస్వాములు ఈ పైశాచిక చర్యలకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది.
"ఖబడ్డార్" పెత్తందార్లలారా పద్ధతి మార్చుకోండి, లేకుంటే ప్రజా కోర్టులో మీకు శిక్ష తప్పదు. చర్లకు చెందిన బడాబాబులు పరుచూరి ప్రేమ్ చంద్, అమర్ చంద్, (పరుచూరి రవి ), ఆవుల సత్యనారాయణ కుమారులు తన్నీరు, కొత్తపల్లి కుటుంబాలు, కడెం సత్యనారాయణ సోదరులు, ఇర్ఫా వసంత్ & కో బ్యాచ్, ఆర్, కొత్తగూడెం బుజ్జి, శేశెట్టి సాంబయ్య, వలసా లింగమూర్తి, కొత్తపల్లి శ్రీనివాసరావు, కోటేరు శ్రీనివాస్ రెడ్డి, లంక రాజు, మీసాల సీతయ్య, జవ్వాది రవికుమార్, (జవ్వాది మున్నీ విలేఖరి అనే ముసుగులో ప్రజలను ఏమార్చుతున్నారని) సత్యనారా యణపురం నానిబాబు అండ్ బ్రదర్స్, ఆర్. కొత్తగూడెం భూ స్వాములు తమ పెత్తందారి విధానాలు తిరిగి అమలు చేస్తున్నారని. కొందరు రాజకీయ బ్రోకర్లు నల్లపు దుర్గా ప్రసాద్, విజయ బాస్కర్ రెడ్డి, ఇందల బ్రదర్స్ ఇలా చాలా మంది అధికార పార్టీ నాయ కులు పైవర్గాలకు వంతపాడుతున్నారని. వారి దోపిడీకి సహకరిస్తున్నారని. భూ స్వాముల భూములను ఇకనైనా పేదలకు అప్పగించాలని. లేకుంటే ఆ భూములను మా పార్టీ స్వాధీన పర్చుకొని పేదలకు పంచుతుందని హెచ్చరిస్తున్నాం అని లేఖలో తెలిపారు.
రాజకీయ నాయకులు మొదలు కొని కొందరు వ్యాపారులు, భూస్వాములు పోలీసులకు పూర్తి ఇన్ఫార్మర్గా మారిపోయారని. పోలీస్ వ్యవస్థలో పనిచేస్తూ మా పార్టీకి సహకరిస్తున్నట్లుగా మోసపూరిత మాటలు చెప్పి కొందరు ఇన్ఫార్మర్స్ మమ్ములను మాయ చేస్తున్నారని. వారికి మా ప్రజా కోర్టులో మరణ శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నామని. ఖబడ్డార్ పోలీస్ ఇన్ఫార్మర్స్, ఈ వ్యవహారాన్ని మా నెట్ వర్క్ ఆపరేషన్తో వెల్లడైందని. అలాంటి వారు మారాలని కోరుతున్నాం అడవులో ఖనిజ సంపదను ఎత్తుకెళ్ళేందుకు బ్రాహ్మణీయ ఫాసిస్టు బాజాపా ప్రభుత్వంతో చేతులు కలుపుతూ మా పార్టీపై కుట్రలు పన్నుతున్నారని. గొల్లగుప్ప గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ పై జరిగిన అత్యాచారం పై న్యాయవిచారణ చేయాలని డిమాండ్చేస్తున్నాం అని. పూసుగుప్పలో జరిగిన మారణాలపై కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని, ఆపరేషన్ కగార్లో అమరులైన వారి త్యాగాల స్ఫూర్తితో ముందుకుసాగుదాం అంటూ. ఆదివాసీలు, పార్టీ సభ్యులపై సాగుతున్న మారణకాం డకు బదులు తీర్చుకుంటాం అని. ప్రజలకోసం పని చేసే మావోయిస్టు పార్టీకి ప్రజాస్వామిక వాదులు, మేధావులు, విద్యావంతులు, జర్నలి స్టులు, పౌర హక్కులు, మానవ హక్కులు సంఘాలు విప్లవోద్యమాలు ఉద్యమాలకు మద్దుతు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం అని ప్రజా యుద్ధం కొనసాగిద్దామని అమరుల త్యాగాలను ఎత్తిపడదామని.విప్లవ పోరాటాలు కొనసాగిద్దాం. అంటూ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ విప్లవ పేరు మీదుగా మావోయిస్టులు లేఖ విడుల చేశారు