calender_icon.png 20 September, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్-1బీ వీసా @లక్షడాలర్లు

20-09-2025 08:52:03 AM

అమెరికా హెచ్1బీ వీసా నిబంధనల్లో మార్పులు.. 

హెచ్1బీ వీసా దరఖాస్తు రుసుమును పెంచిన ట్రంప్.. 

ట్రంప్ గోల్డ్ కార్డు ప్రకటించిన ట్రంప్.. 

వాషింగ్టన్: అమెరికా హెచ్1బీ వీసా నిబంధనల్లో మళ్లీ మార్పులు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) హెచ్1 బీ వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచారు. హెచ్1 బీ వీసా దరఖాస్తు రుసుము లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ సంతకం చేశారు. హెచ్1బీ వీసా లాటరీ సిస్టమ్ ను అమెరికా తొలగించింది. కొత్త హెచ్1 బీ వీసా విధానం భారత్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. కొత్త వీసా దరఖాస్తు రుసుము పెంపుదల టెక్ సంస్థలపై పెనుభారం పడనుంది. హెచ్1 బీ వీసా లబ్దిదారులతో 70 శాతం కన్నా ఎక్కవ మంది  భారతీయులే ఉన్నారు. హెచ్1 బీ వీసా ద్వారా భారతీయులే ఎక్కువ మంది అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. ట్రంప్ గోల్డ్ కార్డు ద్వారా అగ్రరాజ్యం అమెరికాకు 100 బిలియన్ డాలర్లు సమకూరే అవకాశముంది. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులు, రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధుల వినియోగించనున్నట్లు సమాచారం.

రుసుము ఏటా వసూలు చేస్తామని అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ వెల్లడించారు. హెచ్1 బీ రెన్యువల్ కూ లక్ష డాలర్లు చెల్లించాల్సిందేనని ట్రంప్ తేల్చిచెప్పారు. గ్రీన్ కార్డు లేకుంటే ఉద్యోగం కోల్పోయే అవకాశముంది. అమెరికాలో హెచ్1 బీ వర్క్ వీసాలపై(America H1B work visas) పనిచేస్తున్నా భారతీయ ఉద్యోగులపైనా ప్రభావం చూపనుంది.  అమెరికాలో మాస్టర్స్ ప్రోగ్రామ్ లు చేయాలనుకునే భారతీయులపై దీని ఎఫెక్ట్ పడనుంది. భారతీయ వృత్తి నిపుణులు , నైపుణ్యం కలిగిన చైనా కార్మికులపై ఆధారపడే టెక్ రంగంపై ప్రభావం చూపుతోంది. ట్రంప్ నిర్ణయం ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలపై ప్రభావం చూపనుంది. విదేశీ నిపుణుల నియామకానికి జారీ చేసే ఒక్కో వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సిందే. చెల్లింపునకు కంపెనీలు సుముఖంగా లేకపోతే.. వర్క్ వీసాపై వెళ్లేవారు ఇంటి ముఖం పట్టే ప్రమాదం ఉంది. అమెరికాలో మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయాలనుకునే భారతీయుల ఆశలు ఆవిరయ్యే ప్రమాదం ఉంది. హెచ్1 బీ ప్రోగ్రామ్ ద్వారా లభించే ఉద్యోగాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలే అధికంగా ఉన్నాయి. మూడింటి రెండు వంతులు సాఫ్ట్ వేర్ కు సంబంధమైనవేనని అమెరికా ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. పలు కంపెనీలు ఇంజినీర్లు, విద్యావేత్తలను అమెరికా తీసుకెళ్లేందుకు వీసా ఉపయోగిస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణ కార్మికులను అమెరికా తీసుకెళ్లేందుకు పలు కంపెనీలు హెచ్1 బీ ఉపయోగిస్తున్నాయి. గతేడాది హెచ్1 బీ వీసాల ద్వారా భారత్ కు అత్యధికంగా లబ్ధి చేకూరినట్లు అమెరికా ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. ఆమోదించిన లబ్ధిదారుల్లో భారత్ 71 శాతం కలిగి ఉంది. అమెరికా ప్రభుత్వ లెక్కల ప్రకారం 11.7 శాతంతో చైనా రెండో స్థానంలో ఉంది. ట్రంప్ నిర్ణయంతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు.