calender_icon.png 20 September, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

20-09-2025 10:24:48 AM

రామకృష్ణాపూర్,(విజయాక్రాంతి): రామకృష్ణాపూర్ పట్టణంలోని పలు ప్రవేట్ పాఠశాలల్లో శనివారం ముందస్తు బతుకమ్మ( Bathukamma celebrations) సంబరాలను ఘనంగా నిర్వహించారు.చిన్నారులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మ సంబరాలను ఆటపాటలతో అలరింప చేశారు.పాఠశాల ఆవరణలో బతుకమ్మ సంబురాలు కోలాహలంగా కొనసాగాయి.ఈ సందర్భంగా తవక్కల్ పాఠశాలల యజమాని అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. తెలంగాణ సంస్కృ తికి ప్రతీకగా జరుపుకునే బతుకమ్మ సంబురాలు విద్యార్థుల్లో నూతనోత్తేజాన్ని నింపాయి.