27 May, 2026 | 2:04 AM

మెడికవర్‌లో అరుదైన చికిత్స

27-05-2026 12:15 AM

భారీ అడ్రినల్ ట్యూమర్‌ను తొలగించి సోమాలియా 

యువకుడికి పునర్జన్మ ఇచ్చిన వైద్యులు

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): అత్యంత అరుదైన అడ్రినోకార్టికల్ కార్సినోమా (ఏసీసీ) అనే ప్రమాదకర అడ్రినల్ గ్రంథి క్యాన్సర్‌తో బాధపడుతున్న సోమాలియాకు చెందిన 32 ఏళ్ల రోగికి మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి కొత్త జీవితం ప్రసాదించారు.   తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, జ్వరం, ఆకలి తగ్గడం వంటి సమస్యలతో రోగి ఆసుపత్రిని ఆశ్రయించారు.

వైద్యులు నిర్వహించిన పెట్‌సిటీ ఇతర అధునాతన పరీక్షల్లో కుడి వైపు అడ్రినల్ గ్రంథిలో భారీ కణితి ఏర్పడి, కాలేయం, కుడి మూత్రపిండంపై ప్రభావం చూపుతున్నట్లు గుర్తించా రు. పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉండటంతో బహుళ విభాగాల నిపుణుల బృందం వెంటనే చికిత్స ప్రణాళిక రూపొందించింది.

సీనియర్ కన్సల్టెంట్ యూ రాలజిస్ట్, అండ్రాలజిస్ట్ డా. ఏ.వి. రవి కుమా ర్, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్, హీమటో ఆంకాలజిస్ట్ డా.ఎ. వేణుగోపాల్, లివర్ ట్రా న్స్ప్లాంట్ సర్జన్ డా. కిషోర్ రెడ్డి నేతృత్వంలోని నిపుణుల బృందం ‘రాడికల్ రైట్ అడ్రినలెక్టమీ విత్ రైట్ నెఫ్రెక్టమీ అండ్ రైట్ హె పటెక్టమీ’ అనే అత్యంత క్లిష్ట శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

కణితితో పాటు కుడి మూత్రపిండం, కాలేయంలోని ప్రభావిత భాగాన్ని తొలగించారు. డా. ఎ. వేణుగోపాల్ పర్యవేక్షణలో రోగికి ఎటోపోసైడ్, డాక్సోరూబిసిన్, సిస్ప్లాటిన్లతో కూడిన ఈడీపీ కీమో థెరపీని ఆరు సైకిళ్ల పాటు అందించారు. రోగి  ప్రస్తుతం ఆరోగ్యంగా కోలుకుంటున్నారు.