10 July, 2026 | 12:47 AM

మైసా..రి స్కీ స్టంట్స్!

10-07-2026 12:11 AM

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం ప్రతిష్టాత్మక పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో ఆదివాసీ గోండ్ యువతిగా కనిపించనున్న రష్మిక.. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. తాజాగా రష్మిక అత్యంత ప్రమాదకరమైన యాక్షన్ సన్నివేశాలను స్వయంగా చేశారు. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు దాదాపు 20 గంటలు నీటిలో ఫైట్స్ చేశారు.

భారతీయ సినీ చరిత్రలో ఓ కథానాయిక స్వయంగా చేసిన తొలి అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ ఇదేనని టీమ్ పేర్కొంది. బాడీ డబుల్‌ను ఉపయోగించకుండా, రష్మిక స్వయంగా చేస్తున్న రిస్కీ స్టంట్స్ మూవీపై అంచనాలను పెంచుతోంది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో, అన్‌ఫార్ములా ఫిలమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డీవోపీ: శ్రేయాస్ పీ కృష్ణ; సంగీతం: జేక్స్ బిజోయ్; యాక్షన్: కేచా ఖాంఫక్డీ.