10 July, 2026 | 1:04 AM

థ్రిల్ చేసే అగధ

10-07-2026 12:07 AM

నిర్మాత ఎంఎస్ రాజు దర్శకుడిగా మారి రూపొందించిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ చిత్రం ‘అగధ’. ఈ సినిమాను శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయరాణి రెడ్డి తదితరులు నటించారు.

ఈ సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఆగస్టు 14న విడుదల కానుందని వెల్లడించారు. ఈ సినిమాకు సంగీతం: రాకేశ్ వెంకటాపురం; సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి; ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ; ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్ నాయర్.