1 August, 2026 | 3:31 AM

రష్మికకు తీవ్ర గాయం

01-08-2026 02:03 AM

డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా హీరోయిన్ రష్మిక మందన్న తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె ‘రణబాలి’, ‘మైసా’ సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఈ రెండు చిత్రాల్లో వరుసగా యాక్షన్ సీక్వెన్సులు, డ్యాన్స్ పర్‌ఫార్మెన్సులు చేయడం వల్ల రష్మిక తుంటి భాగంలో స్నాయువు (కండర బంధనము) పూర్తిగా విడిపోయింది. ఆమెకు హిప్ ఏరియాలో ఇంతటి గాయం కావడం వైద్యులను సైతం షాక్‌కు గురిచేసింది. తీవ్రంగా సాధన చేసే క్రీడాకారుల్లో మాత్రమే ఇలాంటి గాయాలు అవుతుంటాయని వైద్యులు చెబుతున్నారు.

రష్మిక 6 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. టెండన్ తిరిగి బలపడేందుకు రీహాబిలిటేషన్ కూడా అవసరం అని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రష్మిక మందన్న పాన్ ఇండియా స్థాయిలో బిజీయెస్ట్ హీరోయిన్‌గా కెరీర్ కొనసాగిస్తున్నారు. ఆమె 4 భారీ చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. అలాగే 30 ప్రాడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. రష్మికకు అయిన తీవ్ర గాయంతో ఆయా సినిమాలు, వ్యాపార ప్రకటనల షూటింగ్స్ నిలిచిపోనున్నాయి. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.