18 July, 2026 | 1:20 AM

సర్ ప్రక్రియ 60 శాతం పూర్తి

18-07-2026 01:20 AM

ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి 

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇప్పటీ వరకు సర్ ప్రక్రియ 60 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సంగా రెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని సుల్తాన్‌పూర్, ఐలాపూర్, పటాన్‌చెరులో బీఎల్‌ఓలు నిర్వహిస్తున్న సర్ శిబిరాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు.

సర్ ప్రక్రియపై బీఎల్‌ఓలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో 80 శాతం, పట్టణ ప్రాంతాల్లో 45 శాతం సర్ పూర్తయిందని తెలిపారు. ఎన్యూమరేషన్ పత్రాలు అందని వారు సర్ ప్రక్రియ సూపర్ వైజర్లను అడిగి పత్రాలు తీసుకోవాలన్నారు. పీఎల్‌వో, బీఎల్‌వోల సహకారంతో సర్ ప్రక్రియ కొనసా గుతోందన్నారు. శిబిరాల వద్ద వివిధ పార్టీలకు చెందిన వారు ఉండటాన్ని గమనించిన సీఈవో.. ఇక్కడ ఉండటానికి పార్టీ గుర్తింపు కార్డులు ఏమైనా ఇచ్చారా..? అంటూ ప్రశ్నించారు. సర్ గడువు పొడిగింపు తేదీని దృష్టిలో పెట్టుకుని ప్రక్రియను కొనసాగించాలని సూచించారు.