18 July, 2026 | 1:18 AM

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

18-07-2026 01:18 AM

సీనియర్ నాయకులు శ్రీరామనేని నాగేశ్వరరావు

మధిర, జూలై 17(విజయ క్రాంతి): దేశంలో విద్యార్థుల భవిష్యత్తు కొరకు నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పులు సరి చేయాలని, పరీక్ష నిర్వహణలో నిజాయితీ ఉండాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి సీనియర్ నాయకులు శ్రీరామనేని నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విక్రమార్క నుండి ర్యాలీగా మహాత్మా గాంధీ విగ్రహానికి వెళ్లి మాత్మ గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు యస్ నాగేశ్వరావు మాట్లాడుతూ.... 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విజ్ఞాన వేత పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్  సంఘీభావంగా కాక్రోచ్ జనతా పార్టీ సంఘీభావం తెలిపిందని అన్నారు. విద్యార్థుల తరఫున 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న కళ్ళుండి చూడలేని  ,చెవులు ఉండి వినలేని ఈ దేశం గుడ్డిపాలనలో ఇంతటి క్రూరత్వాన్ని చూడలేదని అన్నారు. నీట్ నిర్వహణ పాలకవర్గాలు నిర్లక్ష్యం కారణంగా పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.

ప్రస్తుతం దేశంలో ఓటర్ల పైన కేంద్ర ప్రభుత్వం తప్పులు చేసిందని చాలామంది ఓట్లు తొలగించే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. దేశంలోని మేధావులు దేశం ప్రమాదంలో ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా హిందూ మతం, దేశ రాజ్యాంగం, పరీక్షల నిర్వహణ ప్రమాదంలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డు సురేష్, మొగిలి శ్రీను, పుష్ప పండు, యన్ పవన్, జీవన్, కృష్ణమూర్తి, బొడ్డు సురేష్ తదితరులు పాల్గొన్నారు.