రతన్ టాటా యువ మిత్రుడికి కీలక పదవి
05-02-2025 12:34 AM
ముంబై: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా జీవిత చరమాంకంలో ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి శంతను నాయుడు. చివరి దశలో టాటాకు కేర్‌టేకర్‌గా, జనరల్ మేనేజర్‌గా వ్యవహరించారు. తాజాగా ఆయనకు టాటా గ్రూప్‌లో కీలక పదవి లభించింది. టాటా మోటార్స్‌లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్‌కు జనరల్ మేనేజర్‌గా శంతను నియమితులయ్యారు.
ఈ విషయాన్ని తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో షేర్ చేస్తూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు.‘ టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి తెల్ల షర్టు, నేవీ బ్లూ ప్యాంట్‌లో నా తండ్రి (రతన్ టాటా ను ఉద్దేశిస్తూ) నడుచుకుంటూ ఇంటికి వచ్చేవారు. ఆ సమయంలో నేను ఆయన కోసం ఎదురుచూస్తూ కిటికీలో నుంచి చూసేవాడిని. ఇప్పు డు నేను కూడా అలా నడిచొచ్చే రోజులు వచ్చాయి’ అని శంతను రాసుకొచ్చారు.






