నిరాశపరిచిన డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్
05-02-2025 12:32 AM
ముంబై: డాక్టర్ అగర్వాల్స్ ఐ హా స్పిటల్ మాతృ సంస్థ డాక్టర్ అగర్వా ల్ హెల్త్కేర్ షేర్లుమంగళవారం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. డిస్కౌంట్‌తో దలాల్ స్ట్రీట్‌లో ఎంట్రీ ఇచ్చి మదుపర్లను నిరాశపర్చాయి. ఇష్యూ ధర రూ.402 తో పోలిస్తే బీఎస్‌ఈలో 1.27 శాతం డిస్కౌంట్‌తో రూ.396 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టాయి.
డాక్టర్ అగర్వాల్స్ హెల్త్‌కేర్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ జనవరి 29న ప్రా రంభమై 31న ముగిసింది. ధరల శ్రే ణి రూ.382-402గా కంపెనీ నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.3,027.26 కోట్లు సమీకరించాలనుకుంది. ఐపీఓలో భాగంగా రూ .300 కోట్లు విలువైన తాజా షేర్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.2,727.26 కోట్ల విలువైన షేర్లు జారీ చేసింది.






