జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా రాథోడ్ తుకారం
11-11-2025 12:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 10,(విజయక్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా రాథోడ్ తుకారాన్ని నియమిస్తూ హెల్త్ డైరెక ర్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం నూ తన డిఎంహెచ్వో బాధ్యతలు చేపట్టారు. నూ తన రెగ్యులర్ డిఎంహెచ్‌ఓగా బాధ్యతలు తీసుకున్న ఆయనను తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ తన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మర్యాదపూర్వకంగా కలెక్టర్ జితేష్ వి పాటి ల్ ను పార్టీలను కలిశారు.ఈ కార్యక్రమంలో డి పి హెచ్ డి ఎ డాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ డాక్టర్. శివకుమార్, ట్రెజరర్ డాక్టర్. మురళి, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ చైత న్య,. పుల్లారెడ్డి, తేజశ్రీ, రాకేష్,. ప్రియాంక, వెంకటేష్, . హరీష్ పాల్గొన్నారు




