27 June, 2026 | 7:29 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

రేషన్ డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి..

29-05-2025 05:10 PM

తహసిల్దార్ రామారావు..

తరిగొప్పుల (విజయక్రాంతి): వర్షాకాలం సీజన్ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన సన్న బియ్యాన్ని రేషన్ కార్డు లబ్ధిదారులకు జూన్ నెలలోనే అందిస్తుందని, లబ్ధిదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ రామారావు(Tahsildar Rama Rao) అన్నారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన రేషన్ డీలర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించాల్సిన 3 నెలలకు సంబంధించిన సన్న బియ్యాన్ని జూన్ నెలలోనే పంపిణీ చేస్తున్న నేపథ్యంలో రేషన్ డీలర్లు అందరూ ప్రజా పంపిణీ దుకాణాల్లో అందుబాటులో ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఆంధ్రయ్య, రెవెన్యూ సిబ్బంది, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.