26-08-2025 09:08:05 PM
అడ్డుకున్న పోలీసులు
కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత
కామారెడ్డి,(విజయక్రాంతి): రేషన్ డీలర్లకు రావాల్సిన కమిషన్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. రేషన్ బియ్యం పంపిణీ పూర్తయిన తమకు రావాల్సిన కమిషన్ ఇవ్వడంలేదని ఇప్పటికైనా ఇవ్వాలని రేషన్ డీలర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు భార్యకేళ్ళు పెట్టి రేషన్ డీలర్ల ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు నాగం సురేందర్ మాట్లాడుతూ జిల్లాలో 577 మంది రేషన్ డీలర్ ఉన్నారని తెలిపారు. గత ఐదు నెలలుగా ప్రభుత్వం నుండి రేషన్ డీలర్లకు రావాల్సిన కమిషన్ రావడంలేదని వెంటనే ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. బియ్యం పంపిణీ అయిపోగానే కమిషన్ చెల్లించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఒకే దఫాలో కమిషన్ ఇవ్వాలన్నారు.