25 April, 2026 | 3:37 PM

17 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్

06-02-2025 11:07 PM

ఖమ్మం (విజయక్రాంతి): విశ్వసనీయ సమాచారం మేరకు పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలోని ఉపేందర్ అనే వ్యక్తి ఇంటిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, పౌరసరఫరాల అధికారులు గురువారం దాడి చేసి, 17 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేశారు. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.